కృష్ణవంశీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను : బ్రహ్మాజీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణవంశీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను : బ్రహ్మాజీ

  • కృష్ణవంశీ నాకు 'గులాబి'లో ఛాన్స్ ఇచ్చాడు 
  • 'నిన్నే పెళ్లాడుతా'లోను మంచి పాత్ర ఇచ్చాడు 
  • 'సిందూరం'తో హీరోను చేశాడు 
  • ఆ తరువాత కూడా ఛాన్సులు ఇస్తూనే వస్తున్నాడు      
కృష్ణవంశీకి .. తనకి గల స్నేహ బంధాన్ని గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ ప్రస్తావించారు. " కృష్ణవంశీ తాను డైరెక్టర్ అయితే మంచి కేరక్టర్ ఇస్తానని చెప్పి .. 'గులాబి'లో ఇచ్చాడు. ఆ తరువాత 'నిన్నే పెళ్లాడుతా'లోను మంచి పాత్ర ఇచ్చాడు. ఆ రెండు పాత్రలు బాగా పాప్యులర్ అయ్యాయి.

"ఆ తరువాత నాకు 'సిందూరం'లో ఛాన్స్ ఇచ్చాడు. అది ప్లాప్ అయిందని చెప్పి వదిలేయలేదు .. 'చంద్రలేఖ' సినిమాలో నాతో ఫస్ట్ టైమ్ కామెడీ చేయించాడు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను .. అంత చేశాడు నాకు. ఆ తరువాత 'ఖడ్గం' లోనే కాదు .. రీసెంట్ గా 'నక్షత్రం' సినిమాలోను ఛాన్స్ ఇచ్చాడు. అయితే 'జనతా గ్యారేజ్' కారణంగా నాకు కుదరలేదు. అందువలన వేరే వాళ్లతో ఆ పాత్రను చేయించాడు" అని చెప్పుకొచ్చారు.      
brahmaji

More Telugu News