విమానంలో ఆమె ఒక్కతే ప్రయాణికురాలు... వీఐపీ సేవలు అందించిన సిబ్బంది!
- ట్విట్టర్‌లో ఫొటో షేర్ చేసిన స్కాట్లాండ్ రచయిత్రి
- సిబ్బంది బాగా చూసుకున్నారని వ్యాఖ్య
- ఇలాంటి ప్రయాణాలు చాలా అరుదన్న విమానయాన సంస్థ
నిజానికి మరో ఇద్దరు ప్రయాణికులు రావాల్సి ఉంది. కానీ వారు రాలేకపోవడంతో విమానంలో వీఐపీ సేవలు అందుకునే అవకాశం కారోన్‌కి దక్కింది. ఈ విషయాన్ని తాను ట్విట్టర్‌లో ఫొటో పోస్ట్ చేసి మరీ పంచుకుంది. విమాన సిబ్బంది తనను చాలా బాగా చూసుకున్నారని, వారందరితోనూ ముచ్చటించానని పేర్కొంది. అయితే ఇలాంటి ప్రయాణాలు చాలా అరుదుగా జరుగుతాయని, సీజన్ కాకపోవడం వల్ల ప్రయాణికులు తక్కువగా ఉంటారని విమానయాన సంస్థ ఏజేసీ పేర్కొంది.