బీజేపీ వ్యతిరేకిస్తున్న 'మెర్సెల్' డైలాగిదే... జీఎస్టీపై విజయ్ నోటి వెంట...!
- జీఎస్టీపై చిత్రంలో డైలాగులు
- పన్ను వసూలు చేస్తూ ఉచితవైద్యం ఇవ్వలేరా?
- ఈ మందులపై పన్ను వేసి, ఆ 'మందు'ను వదిలేస్తారా?
- తొలగిస్తామని చెప్పిన నిర్మాతలు
ఇక ఈ చిత్రంలో హీరో విజయ్ నోటి వెంట, "7 శాతం జీఎస్టీ వసూలు చేసే సింగపూర్ లో ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. కానీ, ఇక్కడ 28 శాతం జీఎస్టీ వసూలు చేసే మన ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుంది? పైగా మందులపై 12 శాతం జీఎస్టీ విధించిన ఈ ప్రభుత్వం.. మన ఆడపడుచుల కాపురాలు కూల్చే 'మందు'పై మాత్రం జీఎస్టీ విధించలేదు" అని వినిపిస్తుంది. అదే ఇప్పుడు బీజేపీ ఆగ్రహానికి కారణమైంది. ఇక తాజా నిరసనలతో సదరు డైలాగ్ తీసేస్తామని నిర్మాత చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్టేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.