కంచ ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలన్న పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

  • 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకాన్ని రచించిన కంచ ఐలయ్య
  • ఈ పుస్తకాన్ని నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ 
  • పుస్తకం నిషేధించడమంటే రచయిత భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని అభిప్రాయపడ్డ సర్వోన్నత న్యాయస్థానం
  • పిటిషన్ ను కోట్టేసిన సుప్రీంకోర్టు
ప్రొ. కంచ ఐలయ్యకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. తెలుగు రాష్ట్రాలలో పెను వివాదానికి కారణమైన ఆయన రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కంచ ఐలయ్య రాసిన ఆ పుస్తకం ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని పేర్కొంటూ వీరాంజనేయులు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు.

దీనిని విచారించిన న్యాయస్థానం... పుస్తకాన్ని నిషేధించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని పేర్కొంటూ, ఆ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. పుస్తక రచయితకు చట్టపరిధిలో భావాలను వ్యక్తపరిచే అవకాశముందని, గతంలోనూ పుస్తకాల శీర్షికలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీంకోర్టు పిటిషనర్ కు గుర్తు చేసింది.  
Go Back to Shorts
kancha ilaiah
book
visyas
petition
supreme court

More Telugu News