ఓ వైపు వైశ్యులు, మరోవైపు ఐలయ్య మద్దతుదారులు... తార్నాకలో ఉద్రిక్తత!
- ఐలయ్య ఇంటికి కదిలిన వైశ్య సంఘాల నేత శ్రీను
- అప్పటికే చేరుకున్న ఐలయ్య మద్దతుదారులు
- తార్నాక ఫ్లయ్ ఓవర్ వద్దే వైశ్యులను అడ్డుకున్నపోలీసులు
ఇక మరోపక్క, తన ఇంటికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, జరిగే ఘటనలకు వైశ్యులదే బాధ్యతని ఐలయ్య చెప్పగా, ఆ తీవ్ర పరిణామాలు ఏంటో చూస్తామని వైశ్య సంఘాలు విరుచుకుపడ్డాయి. ప్రస్తుతం వైశ్య నేతలు తార్నాక ఫ్లయ్ ఓవర్ వైపు నుంచి ఐలయ్య ఇంటి వైపు వెళుతుండగా, వారిని అక్కడే మకాం వేసిన పోలీసులు బారికేడ్లతో అడ్డుకుంటున్నారు.