తనను రేపిస్ట్ అని పిలిచిన మహిళకు గట్టిగా సమాధానం చెప్పిన అర్జున్ కపూర్
- అర్జున్ కపూర్ రూపానికి వంకలు పెట్టిన మహిళ
- రేపిస్ట్ పదాన్ని ఒక మహిళ వాడటం బాధాకరం అన్న హీరో
- ట్వీట్ డిలీట్ చేసిన మహిళ
`అర్జున్ కపూర్ చూడటానికి భయంకరంగా, ఒక రేపిస్ట్‌లాగ కనిపిస్తాడు. బాలీవుడ్ నుంచి అతన్ని బయటికి పంపిస్తే కొత్త వారికి అవకాశం దొరుకుతుంది` అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కి అర్జున్ కపూర్ వెంటనే సమాధానం ఇచ్చాడు. `ఒక మహిళ `రేపిస్ట్` అనే పదాన్ని సిగ్గులేకుండా, చాలా సాధారణంగా వాడటం నిజంగా బాధాకరం` అని అర్జున్ ట్వీట్ చేశాడు. దీంతో వెంటనే ఆ మహిళ తన ట్వీట్‌ను డిలీట్ చేసింది.