బిగ్బాస్ కంటెస్టెంట్ జుబైర్ మా కుటుంబానికి చెందిన వాడు కాదు: దావూద్ కుటుంబం
- జుబైర్ ఒక మోసగాడు
- దావూద్ పేరును పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడు
- ఇలాగే కొనసాగితే కేసు పెడతాం
- హెచ్చరించిన దావూద్ కుటుంబీకులు
ఈ విషయంపై దావూద్ కుటుంబానికి చెందిన సమీర్ ఆంటలే మాట్లాడుతూ - `జుబైర్ ఒక మోసగాడు. మా కుటుంబంతో అతనికి ఎలాంటి సంబంధాలు లేవు. ప్రచారం కోసం దావూద్ పేరును వాడుకుంటున్నాడు. ఇలాగే కొనసాగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం` అన్నాడు. అంతేకాకుండా హసీనా పార్కర్ కూతురు ఖాద్సియాను పెళ్లి చేసుకున్నట్లు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు, రెండేళ్ల క్రితం ఖాద్సియా తనని వదిలేసినట్లు జుబైర్ చెబుతున్న విషయాల్లో వాస్తవం లేదని సమీర్ వెల్లడించాడు. తన పిల్లలను తన దగ్గరకి రప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే తాను బిగ్బాస్లో పాల్గొనేందుకు అంగీకరించినట్లు జుబైర్ చెప్పడం వల్ల ఖాద్సియా ఇబ్బందులు ఎదుర్కుంటోందని సమీర్ తెలిపాడు.