బ్యాంకుల్లో జాబ్ కోసం చూస్తున్న అమ్మాయిలకు హెచ్చరిక... ప్రైవేటు బ్యాంకుల్లో పెరిగిన లైంగిక వేధింపులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యాంకుల్లో జాబ్ కోసం చూస్తున్న అమ్మాయిలకు హెచ్చరిక... ప్రైవేటు బ్యాంకుల్లో పెరిగిన లైంగిక వేధింపులు!

  • వేధింపుల్లో ముందున్న ఐసీఐసీఐ
  • ఆ తరువాత యాక్సిస్, హెచ్డీఎఫ్సీ
  • ప్రభుత్వ బ్యాంకుల్లో తగ్గిన కేసులు
  • వెల్లడించిన 'కాంప్లికారో సర్వీసెస్'
చక్కగా చదువుకుని బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలన్న లక్ష్యంతో శ్రమించే అమ్మాయిలకు కాస్తంత ఆందోళన కలిగించే అంశమిది. ఇతర రంగాలతో పోలిస్తే బ్యాంకుల్లో లైంగిక వేధింపులు గణనీయంగా పెరిగిపోతున్నట్టు 'కాంప్లికారో సర్వీసెస్' గణాంకాలు వెల్లడించాయి. 2016-17 సంవత్సరంలో భారత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన 25 బ్యాంకుల్లో 210 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 5 శాతం అధికం కాగా, అత్యధిక వేధింపులు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐలో నమోదయ్యాయి. ఆపై యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు నిలిచాయి.

బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతతో పాటు ఉద్యోగుల్లో మరింత అవగాహన తెస్తేనే కేసుల సంఖ్య తగ్గుతుందని ఈ సందర్భంగా 'కాంప్లికారో సర్వీసెస్' అభిప్రాయపడింది. చాలా బ్యాంకుల్లో జీరో - టోలరెన్స్ వ్యవస్థలు ఉన్నాయని, అయితే, లైంగిక వేధింపుల ఫిర్యాదులన్నీ కూడా నిజమైనవేనని నమ్మేందుకు వీల్లేదని 'కాంప్లికారో సర్వీసెస్' ఫౌండర్ విశాల్ కేడియా తెలిపారు. 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేధింపుల సంఖ్య 2015-16తో పోలిస్తే 50 నుంచి 47కు తగ్గగా, 10 ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం కేసుల సంఖ్య 150 నుంచి 163కు పెరగడం ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు.
sexual harrasment
banks
women
icici
PSU banks

More Telugu News