chiranjeevi: చిరంజీవికి కొత్త పదవినిచ్చిన కాంగ్రెస్ పార్టీ

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా మెగాస్టార్ చిరంజీవి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, చిరంజీవి స్వయంగా కోరడంతోనే ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బ్లాక్ 1 నుంచి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

 మొత్తం 17 మందిని పీసీసీ సభ్యులుగా జిల్లా నుంచి ఎంపిక చేశారు. ఈ నెల 10వ తేదీన విజయవాడలో పీసీసీ సర్వసభ్య సమావేశం జరుగనుండగా, ఆపై పీసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఇదిలావుండగా, ప్రస్తుతం కొవ్వూరు బ్లాక్ 1 నుంచి పీసీసీ సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నేత అమరజహా బేష్, చిరంజీవి కోరిక మేరకు తన పదవిని వదులుకున్నారు. ఆమె స్థానంలో చిరంజీవికి స్థానం లభించింది.
Go Back to Shorts
chiranjeevi
PCC
congress

More Telugu News