వరద బాధితులకు పేపర్ టవల్స్ విసిరేసిన ట్రంప్... విరుచుకుపడిన నెటిజన్లు!
- ఇదేమీ టీవీ షో కాదంటూ సలహా
- `సంతాపం తెలియజేయడం రాని ప్రెసిడెంట్` అంటూ కామెంట్లు
- తీవ్ర అసంతృప్తికి లోనైన ప్యూర్టో రికో బాధితులు
ఆ తర్వాత ప్యూర్టో రికోలో హరికేన్ మరియా బాధితులను పరామర్శించడానికి ట్రంప్ వెళ్లారు. అక్కడ బాధితులకు పేపర్ టవల్స్‌ను ట్రంప్ విసరడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఏదో టీవీ షోలో అవార్డులు ఇస్తున్నట్లు పేపర్ టవల్స్‌ను పంచడం సబబు కాదని చెబుతున్నారు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ప్రెసిడెంట్‌కి కష్టకాలంలో ఉన్న తన ప్రజలకు కనీసం సంతాపం తెలియజేయడం కూడా రాదని కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తికి లోనయినట్లు ప్యూర్టో రికో బాధితులు చెప్పారు.