charan: చరణ్ తో ఐటమ్ సాంగ్ కి పూజా హెగ్డే రెడీ!

షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోయిన్స్ లో చాలామంది ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. తమన్నా .. కాజల్ ఐటమ్ సాంగ్స్ తోను దుమ్మురేపేస్తున్నారు. ఇక ఆ బాటలోనే రాశి ఖన్నా కూడా అడుగులు వేస్తోంది. 'రాజా ది గ్రేట్' సినిమా కోసం ఆమె ఐటమ్ సాంగ్ చేసింది. ఇక పూజా హెగ్డే కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అవుతోంది .. అదీ చరణ్ మూవీలో.

చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఒక ఐటమ్ సాంగ్ ను కూడా సుకుమార్ రెడీ చేసి ఉంచాడట. మాస్ ఆడియన్స్ ను ఊపేసే ఈ సాంగ్ ను ఎవరితో చేయించాలా? అనే విషయంలో తర్జన భర్జనలు పడిన ఆయన, చివరికి పూజా హెగ్డే ను ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, త్వరలోనే ఈ సాంగ్ చిత్రీకరణ ఉంటుందని సమాచారం.   
Go Back to Shorts
charan
samanta

More Telugu News