నా కొడుకు అలా ఎందుకు చేశాడో: సింగర్ ఉదిత్ నారాయణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కొడుకు అలా ఎందుకు చేశాడో: సింగర్ ఉదిత్ నారాయణ్

  • రాయపూర్ విమానాశ్రయంలో వీరంగం సృష్టించిన ఆదిత్య నారాయణ్
  • డ్యూటీ మేనేజర్ ను అసభ్య పదజాలంతో దూషించిన ఉదిత్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • తన కొడుకు మంచి వాడని కితాబిచ్చిన ఉదిత్
రాయపూర్ విమానాశ్రయంలో వెటరన్ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ ఉద్యోగులతో గొడవ పడిన వీడియో వైరల్ కాగా, తన కుమారుడు చేసిన పనిపై ఉదిత్ స్పందించారు. ఉదిత్ చేసిన పనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా, 'హిందుస్థాన్ టైమ్స్' పత్రికతో మాట్లాడిన ఉదిత్, "చిన్నతనం నుంచి మా వాడు బుద్ధిమంతుడు. చాలా కష్టపడి పనిచేస్తుంటాడు. విమానాశ్రయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ, వీడియో చూస్తుంటే మాత్రం ఆదిత్య చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకలా చేశాడో. ఘటనపై ఎయిర్ లైన్స్ సిబ్బంది నుంచి సమాచారం లేదు. దాన్ని ఎవరు వీడియో తీశారో. అన్ని చోట్లా అప్ డేట్ చేశారు. ఘటనపై నేను ఇంకా ఆదిత్యతో మాట్లాడలేదు" అని చెప్పారు.

 కాగా, రాయపూర్ నుంచి ముంబైకి ఐదుగురితో కలసి ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్న ఆదిత్య, 40 కిలోల అదనపు లగేజ్ ని తీసుకురాగా, దానికి రూ. 13 వేలు చెల్లించాలని బోర్డింగ్ పాస్ ఇస్తున్న యువతి కోరిన వేళ, ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. తానో అమ్మాయితో మాట్లాడుతున్నానని, జరుగుతున్న ఘటనను వీడియో తీస్తున్నారన్న విషయాలను మరచిపోయిన ఆదిత్య, ఆ అమ్మాయిపై, అక్కడి ఇండిగో అధికారులపై రెచ్చిపోయాడు. డ్యూటీ మేనేజర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. తాను రూ. 10 వేల కన్నా ఎక్కువ చెల్లించేది లేదని తేల్చి చెబుతూ వేలు చూపించి మాట్లాడాడు. బిగ్గరగా కేకలు వేశాడు. ఆపై అతన్ని ప్రయాణానికి అనుమతించేది లేదని ఇండిగో స్పష్టం చేయగా, ఆదిత్య, అక్కడి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాడు.
udit narayan
aditya narayan
raipur
indigo

More Telugu News