కనీస ఛార్జీలను తగ్గించిన ఎయిర్ ఏషియా... అక్టోబర్ 2 నుంచి 15లోగా బుకింగ్‌లు
- స్వదేశీ మార్గాల్లో కనీస చార్జీ రూ. 1299
- విదేశీ మార్గాల్లో రూ. 2399
- వెబ్‌సైట్, యాప్ వినియోగదారులకు మాత్రమే
అయితే ఈ ఆఫర్ వర్తింపు కోసం అక్టోబర్ 2 నుంచి 15లోపు టికెట్లను బుక్ చేసుకోవాలి. నిన్న మొదలైన ఈ ఆఫర్ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణాలకు వర్తిస్తుంది. స్వదేశీయంగా హైదరాబాద్, కోల్‌కతా, కొచ్చి, న్యూ ఢిల్లీ , రాంచీ, పుణె తదితర మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు, ఇక అంతర్జాతీయంగా కౌలాలంపూర్, బాలి, బ్యాంకాక్, మెల్‌బోర్న్, సిడ్నీ, సింగపూర్, ఆక్లాండ్‌లతో పాటు ఆసియాలోని 120 మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఎయిర్ ఏషియా అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్‌చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.