కేసీఆర్ చెడు సంప్రదాయానికి తెర తీస్తున్నారు: కిషన్ రెడ్డి
- కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు
- సింగరేణి ఎన్నికల్లో ఇంతవరకు ఏ సీఎం కల్పించుకోలేదు
- కేసీఆర్ సింగరేణి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు
గెలుపు కోసం సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారని తెలిపారు. సింగరేణి కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికొదిలేశారని... ఇప్పుడు మళ్లీ కొత్తగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పి కార్మికులను బుట్టలో వేసుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇన్ని సంవత్సరాలైనా సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు కట్టించి ఇవ్వలేదని ప్రశ్నించారు.