ప‌ది త‌ల‌ల రావ‌ణుడికి ఎన్ని ఆధార్ కార్డులు జారీ చేస్తారు?... ప్ర‌శ్నించిన నెటిజ‌న్‌.. సరైన జవాబిచ్చిన యూఐడీఏఐ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప‌ది త‌ల‌ల రావ‌ణుడికి ఎన్ని ఆధార్ కార్డులు జారీ చేస్తారు?... ప్ర‌శ్నించిన నెటిజ‌న్‌.. సరైన జవాబిచ్చిన యూఐడీఏఐ!

  • తిరుగులేని స‌మాధాన‌మిచ్చిన యూఐడీఏఐ
  • మెచ్చుకున్న ఇత‌ర నెటిజ‌న్లు
డిజిట‌ల్ ఇండియాలో భాగంగా న‌రేంద్ర‌మోదీ పాల‌న‌లో ప్ర‌తి ఒక్క ప్ర‌భుత్వ విభాగానికి ట్విట్ట‌ర్ అకౌంట్ ఉంది. అదేవిధంగా ఆధార్ కార్డులు జారీ చేసే యూఐడీఏఐకి కూడా ఉంది. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఆధార్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా యూఐడీఏఐ వారు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. రావ‌ణుడి ప‌ది త‌ల‌ల‌ను ఆధార్ ద్వారా తీర్చుకోగ‌ల ప‌ది స‌మ‌స్య‌లుగా చూపిస్తూ వారు ఒక ఫొటో పోస్ట్ చేశారు.

అయితే ఈ పోస్ట్‌కు స్పంద‌న‌గా యూఐడీఏఐని హేళ‌న చేస్తూ ఓ నెటిజ‌న్ చిలిపి ప్ర‌శ్న వేశాడు. ప‌ది త‌ల‌లు ఉన్న రావణుడికి ఎన్ని ఆధార్ కార్డులు జారీచేయాల‌ని అత‌డు ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌కు యూఐడీఏఐ తిరుగులేని స‌మాధానం ఇచ్చింది. `రావణుడు భార‌తీయుడు కాదు... అందుకే ఆధార్ జారీ చేయ‌డం కుద‌ర‌దు` అని బ‌దులు పోస్ట్ చేసింది. ఈ స‌మాధానాన్ని ఇత‌ర నెటిజ‌న్లు పొగడ్త‌ల‌తో ముంచెత్తారు.
 
aadhaar
ravana
twitter
reply
netigen
uidai

More Telugu News