ఆడ‌పిల్లకు జ‌న్మనిచ్చిన సోహా అలీ ఖాన్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆడ‌పిల్లకు జ‌న్మనిచ్చిన సోహా అలీ ఖాన్‌!

  • ట్విట్టర్లో వెల్లడించిన భర్త కునాల్
  • బాలీవుడ్ ప్రముఖుల అభినంద‌న‌లు
మ‌హార్న‌వ‌మి రోజున బాలీవుడ్ న‌టి సోహా అలీ ఖాన్ పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని ఆమె భ‌ర్త కునాల్ ఖేము ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. అత‌ని పోస్ట్ మీద కామెంట్ చేస్తూ చాలా మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు అభినంద‌న‌ల జ‌ల్లు కురిపించారు.

 ప్రియాంక చోప్రా, ప‌రిణీతి చోప్రా, రాహుల్ ధోలాఖియా, సోఫీ చౌద‌రి, అలోక్ నాథ్‌, వివేక్ అగ్నిహోత్రి, సోనీ ర‌జ్దాన్ వంటి చాలా మంది ప్ర‌ముఖులు కునాల్‌, సోహా దంప‌తుల‌ను అభినందించారు. సోహా గ‌ర్భ‌వ‌తి అయిన‌ప్ప‌టి నుంచి బిడ్డ ఎదుగుద‌ల‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని ఆ దంప‌తులు సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవ‌ల బేబీ ష‌వర్ వేడుక కూడా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు సోహా అలీ ఖాన్ వ‌దిన‌, క‌రీనా క‌పూర్ ఖాన్ త‌న కుమారుడు తైమూర్‌తో స‌హా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.
soha ali khan
bollywood
congratulations
taimoor ali khan
saif ali khan
kareena kapoor

More Telugu News