వంద వికెట్ల క్లబ్ లో చేరిన ఉమేష్ యాదవ్

  • నాలుగో వన్డేలో నాలుగు వికెట్లు తీసిన ఉమేష్
  • 71 వన్డేల్లో ఘనత
  • టెస్టుల్లో కూడా సెంచరీకి చేరువైన పేసర్
టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ మరో ఘనతను సాధించాడు. వన్డేల్లో వంద వికెట్ క్లబ్ (102) లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరుగుతున్న నాలుగో వన్డేలో ఉమేష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో ఉమేష్ నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంమీద 71 వన్డేల్లో 69 ఇన్నింగ్స్ లలో ఉమేష్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.  మరోవైపు టెస్టుల్లో కూడా ఉమేష్ 100 వికెట్లకు చేరువలో ఉన్నాడు. 34 మ్యాచ్ లు ఆడిన అతను ఇప్పటి వరకు 94 వికెట్లను పడగొట్టాడు. 
Go Back to Shorts
umesh yadav
team india
100 wickets

More Telugu News