`కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి`లో పీవీ సింధు... గ‌ర్వంగా ఉంద‌న్న అమితాబ్‌

  • హాట్ సీట్‌లో సంద‌డి చేయ‌నున్న బ్యాడ్మింట‌న్ స్టార్‌
  • షూటింగ్ ఫొటో పోస్ట్ చేసిన అమితాబ్‌
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి` కార్య‌క్ర‌మంలో బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మానికి ఆమె అతిథిగా హాజ‌రైన ఎపిసోడ్ షూటింగ్ ఫొటోను అమితాబ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన ప్ర‌పంచ ఛాంపియ‌న్ పీవీ సింధు త‌న షోకి రావ‌డం గ‌ర్వంగా ఉంద‌ని అమితాబ్ పేర్కొన్నారు. అమితాబ్ అడిగిన ప్ర‌శ్న‌లకు హాట్‌సీట్‌లో కూర్చుని పీవీ సింధు ఎలాంటి స‌మాధానాలు చెప్పిందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Go Back to Shorts
pv sindhu
kbc
amitabh bachan
twitter
shooting

More Telugu News