100 కోట్లను కొల్లగొట్టిన 'జై లవ కుశ': కళ్యాణ్ రామ్
- 100 కోట్ల క్లబ్ లో 'జై లవ కుశ'
- వరుసగా 100 కోట్లు కొల్లగొట్టిన జూనియర్ రెండో సినిమా
- అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన కల్యాణ్ రామ్
ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'జై లవ కుశ' సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రూ. 100 కోట్ల కలెక్షన్లను ఈ సినిమా దాటేసిందని... ఇంకా వసూళ్లను రాబడుతూనే ఉందని చెప్పాడు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
విడుదలైన మూడు రోజులకే రూ.75 కోట్లు రాబట్టిన ఈ సినిమా వారం రోజుల్లోపే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. మరోవైపు, వరుసగా రెండు ఎన్టీఆర్ సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం గమనార్హం. 'జై లవ కుశ' కు ముందు వచ్చిన 'జనతా గ్యారేజ్' కూడా వంద కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది.