nagarjuna: మీసాలు తీసేసిన నాగార్జున ఫోటో వైరల్... మహాభారతంలో కర్ణుడిపాత్రకు మేకప్ టెస్టేనా?

షార్ట్స్‌లో చూడండి
ఒక్కసారిగా మారిపోయిన హీరో నాగార్జున లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా మీసం లేకుండా కనిపించని నాగ్, ఇప్పుడు దాన్ని తీసేశారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనున్న 'మహాభారతం' చిత్రం కోసం కర్ణుడి పాత్రకు ఆయన ఎంపికయ్యారని, అందుకు మేకప్ టెస్టు కోసం మీసం తీసేశారని అంటుండగా, మరికొందరు 'రాజుగారి గది-2'లో కొన్ని కీలక సన్నివేశాల కోసం ఆయన మీసం తీసేసినట్టు చెబుతున్నారు. ఇంకొందరు 'సరదాగా తీసుంటాడులే' అని కూడా అంటున్నారు. ఇక తాను మీసం ఎందుకు తీయాల్సి వచ్చిందన్న విషయమై నాగ్ చెబితేగాని నిజం తెలియదు. నాగ్ మీసం లేకుండా కనిపిస్తున్న లేటెస్ట్ ఫోటో మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
nagarjuna
mahabharatam
karna

More Telugu News