మరో కీచక బాబా... లా విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన ఫలాహరీ బాబా
- డేరాబాబా బాటలో మరో బాబా
- లా చదివిన యువతిపై అత్యాచారయత్నం
- సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
- అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు
- అప్పటికే విషయం తెలిసి ఆసుపత్రిలో చేరిన బాబా
హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన బాబా, యువతిని చూసి తలుపుగడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు. దీంతో యువతి అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో అతను తన సోదరిని తీసుకుని బిలాస్ పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు నిమిత్తం బాబా ఆశ్రమానికి వెళ్లారు. అయితే ఆశ్రమంలో ఆయన కనిపించలేదు. అప్పటికే విషయం తెలుసుకున్న బాబా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు ఐసీయూలో బాబాను చూసి విచారించకుండా వెనుదిరిగారు.