ntr: మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధమే : ఎన్టీఆర్

షార్ట్స్‌లో చూడండి
తొలిసారిగా ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించిన 'జై లవ కుశ' .. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒకేసారి సినిమాలు విడుదలవుతుండటం పట్ల స్పందించారు.

 హీరోల మధ్య పోటీ ఉండాలనీ .. అయితే అది ఆరోగ్యకరంగా వుండాలని అన్నారు. ఎవరి టాలెంట్ వారిదని .. ఎవరి ఫ్యాన్స్ వాళ్లకి వున్నారని చెప్పారు. వైవిధ్యభరితమైన కథల పట్లనే తాను మొగ్గుచూపుతానని అన్నారు. మంచి కథ .. ఆకట్టుకునే పాత్రలు .. సమర్ధుడైన దర్శకుడు దొరికితే, ఇతర హీరోలతో కలిసి నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. మల్టీ స్టారర్ మూవీస్ చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనంటూ, తమిళ మార్కెట్ కి ఇప్పట్లో వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.      
Go Back to Shorts
ntr

More Telugu News