గాయకుడి కుమార్తెకు ముద్దులు పంచిన స్మృతి ఇరానీ!
`ఒక్క ఫొటో వెయ్యి భావాలను పలుకుతుంది. ఇరానీజీ, మెదీనా మధ్య తొలిచూపులోనే ప్రేమ పుట్టింది. అందుకు కృతజ్ఞతలు’ అంటూ అద్నాన్ ఫొటోలు షేర్ చేశాడు. స్మృతి ఇరానీ చేతుల్లో ముసిముసి నవ్వులు నవ్వుతున్న మెదీనాను ఈ ఫొటోల్లో చూడొచ్చు. గతంలో ఈ దంపతులు ప్రధాని మోదీని కూడా కలుసుకున్నారు. అప్పుడు కూడా మెదీనాను మోదీ ముద్దు చేస్తున్న ఫొటోలను అద్నాన్ షేర్ చేశాడు.