రూపాయి ఖర్చు పెట్టకుండా 24 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగిన వ్యక్తి
- గుళ్లు, గురుద్వారాల్లో మకాం
- లిఫ్ట్‌లు అడుగుతూ ప్రయాణం
- మూడు దేశాల సరిహద్దులు దాటిన వైనం
`ఈ ప్రయాణం అంత సులభంగా సాగదు. కొన్ని సార్లు ప్రజలు మన వైపు చాలా అనుమానంగా చూస్తారు. మానవత్వం ఉన్న కొంతమంది మాత్రమే సహాయం చేయడానికి ముందుకు వస్తారు` అన్నాడు. తన ప్రయాణంలో ఒకసారి 48 గంటల పాటు పస్తులు ఉండాల్సి వచ్చిందని, అలాగే ఒకసారి దాదాపు 9 గంటల పాటు లిఫ్ట్ ఇచ్చేవారి కోసం ఎదురు చూడాల్సి వచ్చిన విషయాలను తెలియజేశాడు. తన ప్రయాణానికి సంబంధించిన వివరాలను చెప్పడం ద్వారా ప్రజల నుంచి సాయాన్ని ఆశించే వాడినని, అంతే తప్ప భిక్షాటన చేసేవాడిని కాదని అన్షూ చెప్పాడు. భూటాన్, మయన్మార్ సరిహద్దులను దాటి వెళ్లానని, బంగ్లాదేశ్ సరిహద్దు దరిదాపులకు కూడా వెళ్లినట్లు పేర్కొన్నాడు.