వీడియో గేమ్ కోసం క్రికెటర్ల‌ను అనుక‌రించిన క్రికెట‌ర్‌... వీడియో చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వీడియో గేమ్ కోసం క్రికెటర్ల‌ను అనుక‌రించిన క్రికెట‌ర్‌... వీడియో చూడండి!

త్వ‌ర‌లో రానున్న యాషెస్ క్రికెట్ వీడియో గేమ్ షూటింగ్‌ కోసం ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ ప్ర‌ముఖ క్రీడాకారుల‌ను అనుక‌రించారు. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ ద్వారా క్రికెట‌ర్ల హావ‌భావాల‌ను, బ్యాటింగ్ శైలుల‌ను రికార్డు చేయ‌డంలో భాగంగా ఆయ‌న ఇలా అనుక‌రించారు. ఈ షూటింగ్‌లో భాగంగా భార‌త ఆల్‌రౌండర్ ర‌వీంద్ర జ‌డేజా బ్యాటింగ్ శైలిని కూడా గ్లెన్ మాక్స్‌వెల్ అనుక‌రించాడు.

మ‌రి కొంతమంది ప్రముఖ బ్యాట్స్‌మెన్ల‌కు సంబంధించిన ప్ర‌త్యేక శైలుల‌ను కూడా గ్లెన్ అనుక‌రించారు. వీటిలో స్టీవ్ స్మిత్ షాట్‌, వీరేంద్ర సెహ్వాగ్ షాట్‌, బ్రియాన్ లారా పుల్‌, మాథ్యూ హెడెన్ చార్జింగ్ షాట్‌, తిల‌క‌ర‌త్న దిల్షాన్ దిల్‌స్కూప్ షాట్లు కూడా ఉన్నాయి. వీడియో గేమ్‌కి ప్ర‌చారం క‌ల్పించ‌డంలో భాగంగా యాషెస్ క్రికెట్ వారు ఈ వీడియో విడుద‌ల చేసిన‌ట్లు తెలుస్తోంది.

glenn maxwell
imitating
ashes cricket
jadeja
steve smith

More Telugu News