నా అవకాశాలను కొందరు అడ్డుకుంటున్నారు!: అవికా గోర్ ఆరోపణలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా అవకాశాలను కొందరు అడ్డుకుంటున్నారు!: అవికా గోర్ ఆరోపణలు

  • ఆరోపిస్తున్న అవికా గోర్‌
  • న‌టనకు ముగింపు ప‌ల‌క‌లేదన్న న‌టి
  • అవ‌కాశాల కోసం బాలీవుడ్‌కు?

`బాలికా వ‌ధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు)` సీరియ‌ల్‌తో దేశ‌వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న అవికా గోర్‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రాకుండా కొంత‌మంది ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అడ్డుకున్న‌ట్లు తెలుస్తోంది. తాను సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌నుందంటూ వ‌చ్చిన పుకార్ల‌పై స్పందిస్తూ ఆమె కొన్ని ఆరోప‌ణ‌లు చేసింది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఆమెకు అవ‌కాశాలకు కొదువ‌లేద‌ని, కాక‌పోతే త‌న‌కు పేరు రావ‌డం ఇష్టంలేని కొంద‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు త‌న అవ‌కాశాల‌ను అడ్డుకుంటున్నార‌ని అవికా ఆరోపించింది.

 త‌న‌కు అవకాశాలు ఇవ్వొద్ద‌ని ఈ సెల‌బ్రిటీ పెద్ద‌లు తెలుగు ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు సూచిస్తున్నార‌ని ఆమె పేర్కొంది. అంతే త‌ప్ప‌... తాను సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌లేద‌ని అవికా తెలిపింది. `ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మావా`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా?` సినిమాల‌తో అవికా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తాను ఒక్క తెలుగు సినిమా కూడా సంత‌కం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఆ ఇండ‌స్ట్రీ పెద్ద‌లే అని ఆమె అంటోంది. ఇలాంటి స‌మ‌యంలో సినిమాల‌ను వ‌దిలేస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఆమె ఆందోళ‌న చెందుతోంది. టాలీవుడ్‌లో అవకాశాలు రాకున్నా... బాలీవుడ్‌లో ప్ర‌య‌త్నించుకునే స‌దుపాయం అవికాకు ఉండ‌టంతో ఆమె అక్కడికే వెళుతోందని సినీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.
avika gor
balika vadhu
chinnari pellikuthuru

More Telugu News