ntr: 'శ్రీనివాస కల్యాణం' కథను ఎన్టీఆర్ ఇంకా పూర్తిగా వినలేదట!

షార్ట్స్‌లో చూడండి
దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్లో వచ్చిన 'శతమానం భవతి' భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆ తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరొకటి చేయడానికి వీళ్లిద్దరూ రంగంలోకి దిగారు. కథను బట్టి ఈ సినిమాకి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఈ కథను ఎన్టీఆర్ కి సతీశ్ వేగేశ్న వినిపించగా .. ఆయన పెద్దగా ఆసక్తిని కనబరచలేదనే టాక్ వచ్చింది. అదంతా కేవలం ప్రచారం మాత్రమేననేది తాజా సమాచారం.

 దిల్ రాజు చూచాయగా కొన్ని లైన్స్ మాత్రమే ఎన్టీఆర్ కి చెప్పారట. ఆసక్తిని వ్యక్తం చేసిన ఎన్టీఆర్ .. 'జై లవ కుశ' రిలీజ్ తరువాత పూర్తి కథను వింటానని అన్నాడట. అప్పుడు కథ వినిపించడానికి సతీశ్ వేగేశ్న సిద్ధమవుతున్నాడు. అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. రచయితగానే ఎక్కువ అనుభవాన్ని కలిగిన సతీశ్ వేగేశ్న ఆ ధైర్యం చేస్తాడేమో చూడాలి.    
Go Back to Shorts
ntr
dil raju

More Telugu News