జగపతిబాబును .. మోహన్ లాల్ ను తీసుకునే ఆలోచనలో 'సాహో' టీమ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగపతిబాబును .. మోహన్ లాల్ ను తీసుకునే ఆలోచనలో 'సాహో' టీమ్!

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' మూవీ తెరకెక్కుతోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మలయాళ .. కన్నడ భాషల్లోను దీనిని విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ కారణంగా ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి కథానాయికగా శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారు.

 కీలకమైన పాత్రల కోసం జాకీష్రాఫ్ .. నీల్ నితిన్ ముఖేశ్ .. చుంకీ పాండే .. టిన్నూ ఆనంద్ .. మందిరా బేడీలను ఎంపిక చేసుకున్నారు. ఇక ముఖ్యమైన పాత్రలకి గాను జగపతిబాబును .. మోహన్ లాల్ ను కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ ఇద్దరినీ సంప్రదించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ బిజీ ఆర్టిస్టులే కావడం వలన వాళ్ల డేట్స్ కుదరాలి .. ఆ పై వాళ్లకి ఆ పాత్రలు నచ్చాలి. అప్పుడు గానీ ఈ విషయంలో ఒక క్లారిటీ రాదు. మొత్తానికి ఈ సినిమా తారాగణమే భారీతనానికి అద్దం పడుతోంది.    
prabhas
shrddha kapoor

More Telugu News