నా తరువాత మోక్షజ్ఞ .. ఆ తరువాత దేవాన్ష్ వస్తారు : బాలకృష్ణ
Add ap7am to your home Screen

నా తరువాత మోక్షజ్ఞ .. ఆ తరువాత దేవాన్ష్ వస్తారు : బాలకృష్ణ

దక్షిణ భారత టీవీ .. సినీ స్టంట్ ఆర్టిస్టుల యూనియన్ ను స్థాపించి 50 యేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చెన్నైలో స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన బాలకృష్ణ .. స్టేజ్ పై లైవ్ లో చేసిన స్టంట్స్ అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. బాలకృష్ణ మాట్లాడుతూ .. తాను పుట్టి పెరిగింది చెన్నైలోనేనని చెప్పారు.

 స్టంట్ కళాకారులు అందిస్తోన్న సేవలను బాలకృష్ణ ప్రశంసించారు. 25 యేళ్ల క్రితం స్టంట్ యూనియన్ రజతోత్సవ వేడుకలకు తన తండ్రి వచ్చారనీ, స్వర్ణోత్సవ వేడుకలకు తాను వచ్చానని చెప్పారు. 75 యేళ్ల వేడుకలకు తన తనయుడు మోక్షజ్ఞ వస్తాడనీ, ఇక 100 యేళ్ల వేడుకలకు తన మనవడు దేవాన్ష్ వస్తాడని ఉద్వేగంతో అన్నారు. స్టంట్ కళాకారుల సేవలను ఎప్పటికీ మరిచిపోమనీ, వాళ్లకి ఏ సాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు.      
balakrishna

More Telugu News