ntr: రాజమౌళి చీఫ్ గెస్టుగా 'జై లవ కుశ' ఆడియో ఫంక్షన్

షార్ట్స్‌లో చూడండి
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా చేసిన 'జై లవ కుశ' విడుదలకు ముస్తాబవుతోంది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ లోగా అంచనాలను, అభిమానులలో ఉత్సాహాన్ని పెంచడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. 'వినాయక చవితి'కి 'లవ' టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇక సెప్టెంబర్ 3వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రాజమౌళి రానున్నారని... ఆయన చేతుల మీదుగా ఆడియో రిలీజ్ జరగనుందని అంటున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనే టాక్ రావడంతో, అంతా ఆడియో రిలీజ్ పై దృష్టి పెట్టారు. మూడు విలక్షణమైన పాత్రల్లో .. ముగ్గురు కథానాయికలతో ఎన్టీఆర్ చేసే సందడి కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
Go Back to Shorts
ntr
niveda

More Telugu News