హ్యాట్రిక్ హిట్ దిశగా చైతూ!
ఈ సినిమాతో చైతూకి హ్యాట్రిక్ హిట్ పడాలనే పట్టుదలతో నాగార్జున వున్నారని అంటున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ రోజున ఆడియో వేడుక పెట్టుకుని, సినిమాను సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. నాగ్ ఆశిస్తున్నట్టుగా చైతూకి ఈ మూవీ హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.