52 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యంపై జాతీయ జెండా ఎగ‌ర‌లేదు: రాహుల్ గాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

52 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యంపై జాతీయ జెండా ఎగ‌ర‌లేదు: రాహుల్ గాంధీ

రిషికేశ్‌లో జ‌రిగిన కాంగ్రెస్ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆర్ఎస్ఎస్‌ పైన, ప్రధాని న‌రేంద్ర మోదీపైన విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. గ‌త 52 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యంపై జాతీయ జెండా ఎగ‌ర‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కాంగ్రెస్ పార్టీ ఎంతో బ‌లోపేతం చేసింద‌ని పేర్కొన్న రాహుల్ గాంధీ... కేంద్ర స‌ర్కారు ఒత్తిళ్ల‌కు లొంగ‌కుండా ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకునే వ్య‌వ‌స్థ‌ను కాంగ్రెస్ రూపొందిస్తే ప్ర‌ధాని మోదీ మాత్రం ఇప్పుడు దాన్ని నాశ‌నం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఖాదీ క్యాలెండ‌ర్లు, డైరీల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించ‌డం ప‌ట్ల స్పందించిన రాహుల్ గాంధీ.. స్వాతంత్ర్యం కోసం పాటుబడిన గాంధీ బొమ్మను తొల‌గించి మోదీ త‌న ఫొటోను వేసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.
rahul gandhi

More Telugu News