నాపై తప్పుడు కేసు నమోదు చేశారు: మలయాళ నటుడు విజయ్‌ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాపై తప్పుడు కేసు నమోదు చేశారు: మలయాళ నటుడు విజయ్‌ బాబు

కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న‌ తన కార్యాలయంలో రెండు రోజుల క్రితం న‌టుడు విజయ్ బాబు తనపై దాడి చేశారంటూ నిర్మాత‌ శాండ్రా థామస్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మలయాళ విజ‌య్ బాబు పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్రస్తుతం స‌ద‌రు నిర్మాత‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ విష‌యంపై విజ‌య్ బాబు త‌న ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా స్పందించారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశార‌ని పేర్కొన్నారు. తాను నమ్మిన తన వ్యాపార భాగస్వామితో పాటు ఆమె భర్త తనపై తప్పుడు కేసు పెట్టించార‌ని ఆయ‌న తెలిపారు. స‌ద‌రు నిర్మాత‌తో క‌లిసి విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్‌ హౌస్‌ అనే నిర్మాణ సంస్థను న‌డుపుతూ ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 10 చిత్రాల వ‌ర‌కు తీశారు.
vijay babu

More Telugu News