అంత్యక్రియలు నిర్వహించాలి.. కాల్పులు ఆపండి!: సరిహద్దులో పాక్ రేంజర్లను వేడుకున్న ప్రజలు
శుక్రవారం జనాజా ప్రార్థన ముగిసిన అనంతరం అతడి అంతిమ యాత్ర ప్రారంభమయింది. అదే సమయంలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది. దీంతో మత పెద్దలు మసీదులోని మైక్ వద్దకు వెళ్లారు. తమ బాలుడిని పాక్ రేంజర్లు కాల్చిచంపారని, ఇప్పుడు ఆ బాలుడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని, కాల్పులు ఆపాలని వేడుకున్నారు. దీంతో పాక్ రేంజర్లు కొద్దిసేపు కాల్పులు ఆపేశారు. వెంటనే అంత్యక్రియలు ముగించుకున్న గ్రామస్తులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లి పోయారు. ఆయా గ్రామాల ప్రజలు ప్రతిరోజు ఇటువంటి దుర్భర పరిస్థితులనే చవిచూడాల్సి వస్తుందని స్థానిక ఎమ్మెల్సీ జహంగీర్ మీర్ అన్నారు. సరిహద్దు గ్రామల ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ తమ జీవితాలను నెట్టుకొస్తున్నట్లు ఈ ఘటన ద్వారా మరోసారి తెలిసింది.