కేసీఆర్ దగ్గర డబ్బు ఉందో లేదో నేను మాత్రం చెప్పలేను: జైపాల్ రెడ్డి
కేసీఆర్ వద్ద డబ్బు ఉందో లేదో తాను మాత్రం చెప్పలేనని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను అటువంటి వ్యాఖ్యలు చేయబోనని, అయితే, ఈ అంశంలో తనకు అనుమానాలు మాత్రం ఉన్నాయని ఆయన అన్నారు. పెద్దనోట్లను రద్దు చేసే ముందువరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకున్నారని, దీనిపై మాత్రం తనకు కొన్ని అనుమానాలున్నాయని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కి సంబంధించి ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా తాను మాట్లాడలేనని, ఇంకా మాట్లాడితే అవన్నీ ఊహాగానాలే అని అనుకుంటారని వ్యాఖ్యానించారు.