పేద ప్రజలపై నరేంద్ర మోదీ యుద్ధం ప్రకటించారు: రాహుల్ గాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పేద ప్రజలపై నరేంద్ర మోదీ యుద్ధం ప్రకటించారు: రాహుల్ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని దాద్రీలో ప‌ర్య‌టించిన ఆయ‌న అక్క‌డి పేద‌ల‌తో మాట్లాడి వారి కష్టాల‌ను గురించి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ...  ప్ర‌ధాని మోదీ దేశంలోని పేద ప్ర‌జ‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టించార‌ని వ్యాఖ్యానించారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు కారణం గురించి మోదీ రోజుకో మాట‌ మాట్లాడుతున్నార‌ని రాహుల్ అన్నారు. మొద‌ట న‌ల్ల‌ధ‌నాన్ని, న‌కిలీ నోట్ల‌ను అరిక‌ట్టేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పార‌ని, ఆ తరువాత ఉగ్ర‌వాదాన్ని అరిక‌ట్ట‌డానికి అన్నార‌ని, ఇప్పుడు క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్స్ అంటున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. మోదీ క్యాష్‌లెస్ లావాదేవీల వైపుకు దేశాన్ని తీసుకువెళ‌తాన‌ని అంటున్నార‌ని, కానీ, ఇప్పటికే మోదీ తీసుకున్న నిర్ణ‌యంతో స‌మాజం క్యాష్‌లెస్ స‌మాజంగా మారిపోయి క‌ష్టాల్లో ప‌డింద‌ని ఆయ‌న అన్నారు.
rahul gandhi

More Telugu News