మారేడుని స్త్రీలు తుంచకూడదా?
వివిధ రకాల పుష్పాలతో ... పత్రాలతో దైవాన్ని ఆరాధించడమనేది అనాదిగా వస్తోంది. ఒక్కో రకం పుష్పాలతో ... ఒక్కో రకం పత్రాలతో దైవాన్ని ఆరాధించడం వలన అనేక రకాల ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే పూజ అనగానే వీలైనంతగా వివిధ రకాల పత్ర పుష్పాలను సేకరిస్తూ వుంటారు. ఈ విషయంలో ఇష్ట దైవం అనుగ్రహాన్ని పొందడానికిగాను ఎంత కష్టమైనా పడుతుంటారు.
ఇక పూజ అనగానే అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడంలోనూ ... భక్తి శ్రద్ధలను ప్రదర్శించడంలోను పురుషుల కన్నా స్త్రీలు ముందుంటారు. అయితే కొన్ని రకాల పూజాభిషేకాలు నిర్వహించడంలోను, అందుకు అవసరమైన పుష్పాలను - పత్రాలను ఉపయోగించడంలోను స్త్రీలకు కొన్ని నిబంధనలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో స్త్రీలు తులసి పత్రాలను గానీ, మారేడు పత్రాలనుగాని తుంచకూడదని అంటూ వుంటారు. ఈ కారణంగా పూజకి అవసరమైన తులసినీ ... మారేడు దళాలను పురుషులతోనే కోయిస్తుండటం జరుగుతోంది. అయితే శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాళ్లు మాత్రం, అందులో ఎక్కడా ఇటువంటి నిబంధన లేదని స్పష్టం చేస్తున్నారు. దైవారాధనకి అవసరమైన తులసినీ ... మారేడు దళాలను అందరూ తుంచవచ్చని చెబుతున్నారు.
అయితే పరమ పవిత్రమైన ఈ పత్రాలను శుచిగా వున్నప్పుడు మాత్రమే కోయాలని అంటున్నారు. పరిశుభ్రతను ... పవిత్రతను పాటిస్తూ, దైవ నామ స్మరణ చేస్తూ ఈ పత్రాలను తుంచడం వలన ఎలాంటి దోషం ఉండదని చెబుతున్నారు. దైవానికి భక్తుల మనసే ప్రధానం ... ఆ మనసులోని భక్తి శ్రద్ధలు ముఖ్యం. అందువలన పవిత్రతకు ... పరిశుభ్రతకు ప్రాముఖ్యతనిస్తూ, అందరూ ఆ దైవాన్ని అర్చించవచ్చు ... ఆద్యంతం ఆ దైవం సేవలో తరించవచ్చు.