రాఘవేంద్రుని మహాత్మ్యం
గురువు ఆదేశం మేరకు సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి, నిరంతరం మూలరాముడిని సేవించేవాడు. రాఘవేంద్రస్వామిని దర్శించడం ... ఆయనని సేవించడం భక్తులు అదృష్టంగా భావించేవారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ ఊరు వెళ్లినా తమ ఇంట్లో మూలరాముడి ఆరాధన చేయమని భక్తులు కోరేవారు. అయితే నిజమైన భక్తుల ఇంటికి మాత్రమే ఆయన వెళ్లేవాడు.
అలాగే ఒకసారి ఆయన సుమతి దంపతుల ఇంటికి వెళ్లాడు. ఆ దంపతుల కోరికమేరకు ఆయన మూలరాముడి పూజను ప్రారంభించాడు. పూజ పూర్తికాగానే అన్నసంతర్పణ చేయడానికి సుమతి దంపతులు ఏర్పాట్లు చేయసాగారు. ఆ సమయంలోనే సుమతి దంపతుల ఒక్కగానొక్క కొడుకు గంగాళంలోని నీటిలోపడి చనిపోయాడు. ఈ విషయం తెలిసి కూడా ఆ దంపతులు దుఃఖాన్ని దిగమింగుకున్నారు.
అయితే పూజ చేస్తూ ఉండగానే, జరిగిన ఘోరం రాఘవేంద్ర స్వామికి తెలిసిపోయింది. పూజ పూర్తికాగానే ఆ దంపతులకు ఆయన తీర్థం ఇవ్వబోయాడు. అందుకు వాళ్లు నిరాకరిస్తూ, జరిగిన సంగతిని బయటికి చెప్పారు. పూజకీ ... అన్నసంతర్పణకి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ విషయాన్ని రహస్యంగా ఉంచామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పసివాడైన ఆ బాలుడి మృతదేహం తీసుకువచ్చి రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఉంచారు.
ఆయన ఆ బాలుడి మృతదేహం పై కమండలంలోని నీళ్లు చల్లాడు. నెమ్మదిగా బాలుడిలో చలనం మొదలైంది ... అందరూ చూస్తుండగానే ఆ బాలుడు లేచి కూర్చున్నాడు. అంతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి హద్దులేకుండా పోయింది. ఈ దృశ్యం చూస్తున్న వాళ్లంతా ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. రాఘవేంద్ర స్వామి మహాత్మ్యం ప్రత్యక్షంగా చూసే భాగ్యం లభించినందుకు ఆనందిస్తూ భక్తి శ్రద్ధలతో ఆయన పాదపద్మాలకు నమస్కరించారు.