నామాల కొండ
ఎక్కడ ప్రశాంతత ... పవిత్రత ... నిర్మలమైన భక్తి శ్రద్ధలు ఉంటాయో, అక్కడే భగవంతుడు కొలువై వుంటాడు. దివ్యక్షేత్రాలు ... పుణ్య తీర్థాలు ఇందుకు నిదర్శనంగానే కనిపిస్తుంటాయి. అలా భగవంతుడు తనకి తానుగా ... తన భక్తులను అనుగ్రహించడానికి వచ్చిన క్షేత్రంగా 'తంటికొండ' కన్పిస్తుంటుంది.
తూర్పు గోదావరి జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రంపై ఆవిర్భవించినది శ్రీ వేంకటేశ్వరుడు కాబట్టి, ఈ కొండను 'నామాలకొండ' అని కూడా పిలుస్తుంటారు. ప్రాచీనకాలం నుంచి ఇక్కడ స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ వచ్చాడు. ఎంతోమంది మహర్షుల తపోభూమిగా ఈ కొండ పవిత్రతను సంతరించుకుంది. రాజులు ... సంస్థానాధీశులు ... మహాభక్తులు ఇక్కడి స్వామిని సేవించి తరించారు.
ఆ తరువాత ఈ క్షేత్రం నిరాదరణకి లోనైంది. అలాంటి పరిస్థితుల్లో ఒక భక్తురాలికి కలలో స్వామి కనిపించి తన జాడను తెలియజేశాడు. ఆలయాన్ని పునరుద్ధరించి నిత్య పూజాభిషేకాలు జరిపించమని చెప్పాడు. అంతకన్నా జన్మకి సార్ధకత ఏముంటుందని భావించిన ఆ భక్తురాలు స్వామివారి ఆదేశాన్ని అక్షరాలా ఆచరణలో పెట్టింది. ఫలితంగా స్వామి పూర్వవైభవాన్ని పొందుతున్నాడు.
విశాలమైన ఆలయ ప్రాంగణం ... వందలాదిమంది భక్తులు ఒక్కసారిగా ప్రదక్షిణం చేయడానికి అనుకూలంగా వుంటుంది. గర్భాలయంలో స్వామివారు సమ్మోహన సౌందర్య మూర్తిగా కనిపిస్తుంటాడు. ఆ పక్కనే గల ప్రత్యేక మందిరంలో లక్ష్మీదేవి కొలువై పూజలు అందుకుంటూ వుంటుంది. క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు దర్శనమిచ్చే ఈ క్షేత్రంలో, గోవిందరాజస్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు.
ఇక 'కోరుకొండ'లో కొలువై ఉండటానికి వెళుతూ లక్ష్మీనారసింహస్వామి ఈ కొండపై ఒక పాదం మోపాడని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఒక పాదం గుర్తు కనిపిస్తూ వుంటుంది. ఈ పాదం గుర్తులో నుంచి నీరు ఊరుతూ వుండటం విశేషం. 'నామాలకొండ' ను దర్శించడం వల్ల పాపాలు పటాపంచలై, సకల సంపదలు కలుగుతాయని స్థానికులు చెబుతుంటారు.
ప్రతి ఏడాది వైశాఖ మాసంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ వుంటుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ... స్వామివారిని దర్శించి ... సేవించి ధన్యులవుతుంటారు.