సిందూర శివుడు
సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా శివలింగం నల్లరాయితో మలచబడి కనిపిస్తూ వుంటుంది. ఇక ఉత్తరాదికి సంబంధించిన కొన్ని దేవాలయాలలో చలువరాతితో మలచబడిన శివలింగాలు కూడా దర్శనమిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో నలుపు వర్ణం గల శివలింగాలకు విభూతిని, తెలుపు వర్ణం గల శివలింగాలకు చందనం అలంకరిస్తూ వుంటారు. ఈ కారణంగా గర్భాలయాల్లోని శివలింగాలు ఆయా వర్ణాల్లో కనిపిస్తుంటాయి.
అలా కాకుండా శివలింగం 'సిందూర వర్ణం'లో కనిపిస్తే భక్తులకు కాస్త ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. అలాంటి చిత్రమైన అనుభూతికి గురిచేసే క్షేత్రం మనకి ప్రకాశం జిల్లా 'కందుకూరు' లో కనిపిస్తుంది. ఇక్కడి శివుడికి ప్రతి నిత్యం అభిషేకం అనంతరం సిందూరం పట్టిస్తుంటారు. ఉత్తర భారతదేశంలో కనిపించే ఈ సంప్రదాయం ఇక్కడ దర్శనమివ్వడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
ఇక్కడి స్వామివారిని 'సోమేశ్వరుడు' అనే పేరుతో భక్తులు కొలుచుకుంటూ వుంటారు. గ్రహపీడల వలన ఎదురయ్యే ఆపదలను ... అనారోగ్యాలను తొలగించడం ఇక్కడి స్వామి ప్రత్యేకతని భక్తులు చెబుతుంటారు. ఈ కారణంగానే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు ... స్వామివారిని దర్శించి మొక్కుబడులు చెల్లిస్తుంటారు. గర్భాలయం ఎదురుగా నందీశ్వరుడు జీవంతో తొణికిసలడుతుంటాడు.
కుదురుగా ... తీర్చిదిద్దినట్టుగా కనిపించే ఈ ఆలయంలోనే, వీరభద్రుడు ... భద్రకాళి ... కాలభైరవుడు ... నాగేంద్రుడు కొలువై పూజలందుకుంటూ వుంటారు. ఇక్కడి నాగేంద్రస్వామి ఆలయంచుట్టూ ప్రదక్షిణ చేసిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.