శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం
పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బాల్యంలోనే తన శక్తి సామర్థ్యాలను సమస్త లోకాలకు చాటిచెప్పాడు. అటు అగ్ని పర్వతాలను ... ఇటు మంచు పర్వతాలను సమదృష్టితో చూసే శివయ్య నుంచి ఆయన అనేక విషయాలను తెలుసుకున్నాడు. ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా వాటికి ఎదురు నిలిచాడు ... దుష్టశిక్షణ చేసి శిష్టులకు రక్షణ కల్పించాడు.
అలాంటి సుబ్రహ్మణ్య స్వామి అనేక నామాలతో, వివిధ ప్రాంతాలలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. అలా భక్తులచే అనునిత్యం ఆరాధించబడుతోన్న క్షేత్రం మనకి విజయవాడలోని 'కొత్తపేట'లో దర్శనమిస్తోంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడికి కలలో స్వామి కనిపించి, ఫలానా ప్రాంతంలో తనకి ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోయినా, స్వామివారి ఆదేశం కనుక వెంటనే ఆ భక్తుడు స్వామివారి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు.
ఆలయ నిర్మాణానికి సంబంధించిన తవ్వకాల్లోనే 'శ్రీవల్లీ - దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి' ప్రతిమలు బయటపడ్డాయి. నెమలి వాహనంతో సహా స్వామివారు వెలుగు చూడటం ఇక్కడి విశేషంగా చెబుతూ వుంటారు. ఈ విధంగా ప్రతిమలు బయటపడటం స్వామి మహిమగా భావించిన ఆ భక్తుడు ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి, ఆ ప్రతిమలను గర్భాలయంలో ప్రతిష్ఠించాడు. స్వయం వ్యక్తమైన ఈ ప్రతిమలు దివ్యమైన తేజస్సుతో భక్తుల మనసును హరిస్తుంటాయి.
మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి వస్తోన్న భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయిదు మంగళ వారాలపాటు ఉపవాస దీక్షను చేపట్టి ఇక్కడి స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన కుజ దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక సంతానాన్ని కోరుకునే వారు ఇక్కడి స్వామిని ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు. 'సుబ్రహ్మణ్య షష్ఠి' తో పాటు మిగతా పర్వదినాల్లోను విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు, కృతజ్ఞతా భావంతో కానుకలు సమర్పించుకుంటూ వుంటారు.