శ్రీ దత్త క్షేత్రం
త్రిమూర్తుల అంశావతారంగా అత్రిమహర్షి - అనసూయాదేవి దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు, ఈ ప్రపంచానికి భక్తి .. జ్ఞాన .. యోగ మార్గాలను సూచించాడు. ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ, విశ్వగురువుగా ప్రసిద్ధి చెందాడు. దత్త స్వామికి అవతారం చాలించడమనేది లేదు. ఆయన కొన్ని క్షేత్రాల్లో సూక్ష్మ రూపంలోనూ, మరికొన్ని క్షేత్రాల్లో స్థూల రూపంలోనూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.
ఆపదలో వున్న వాళ్లు దత్తాత్రేయుడిని ఏడుసార్లు స్మరిస్తే చాలు ... ఏడవసారి స్మరించే సమయానికి ఆయన ఎక్కడవున్నా వెంటనే వచ్చేస్తాడు. ఇందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు మనకి ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తాయి. అంతటి మహాత్మ్యం గల దత్తాత్రేయుడు అనేక ప్రాంతాల్లో కొలువై అక్కడి భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనిదే 'ఏలూరు' లోని దత్తాత్రేయ క్షేత్రం.
దత్తాత్త్రేయ స్వామికి సంబంధించిన విశిష్టమైన క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడ అడుగుపెట్టిన వారికి ఈ మాట అక్షరాలా నిజమనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో అద్భుతమైన నిర్మాణశైలితో ఈ క్షేత్రం విరాజిల్లుతుంటుంది. పవిత్రత ... ప్రశాంతత ఆలయం అంతటా కూడా అలుముకుని అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ వుంటాయి. ఆలయ ప్రాంగణంలో దత్త స్వరూపమైన 'మేడిచెట్టు' ... దాని నీడలో స్వామివారి 'పాదుకలు' దర్శనమిస్తూ వుంటాయి.
ఆ పాదుకలకు నమస్కరించుకుని లోపలికి అడుగుపెడితే, గర్భాలయంలో దత్తాత్రేయుడు అనఘాదేవి సమేతంగా కొలువుదీరి కనిపిస్తాడు. ఈ స్వామిని దర్శించడం వలన సకల దోషాలు నశించి, సమస్త సంపదలు కలుగుతాయని అంటారు. సాధారణంగా దత్తాత్రేయుడి విగ్రహాలు చలువరాతితో మలచబడినవి ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. కానీ ఇక్కడ మూలమూర్తులు నల్లరాయితో చేయబడి దివ్యమైన తేజస్సును ప్రసరింపజేస్తుంటాయి.
పీచుతీయని కొబ్బరి కాయలు ముడుపు కట్టడం ఇక్కడ ఆనవాయతీగా వస్తోంది. హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రంలో, వినాయకుడు ... విశ్వేశ్వరుడు ... చాముండేశ్వరీ ... వేణుగోపాలుడు పూజలు అందుకుంటూ వుంటారు. ప్రతి గురువారమే కాకుండా దత్తాజయంతి ... గురుపౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. ఈ శుభ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.