ఎర్రగట్టు వేంకటేశ్వరుడు
తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కొండకి దిగువునగల గోవిందరాజ స్వామిని దర్శించుకుని, ఆ తరువాత కొండపైకి చేరుకుంటారు. స్థల పురాణాన్నిబట్టి ఇక్కడి గోవిందరాజ స్వామికి ... శ్రీనివాసుడికి ఎంతో ప్రాముఖ్యత వుంది. అయితే ఈ విధంగా కనిపించే వేంకటేశ్వరస్వామి క్షేత్రాలు అరుదుగా వుంటాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా హనుమకొండలోని 'ఎర్రగట్టు' దర్శనమిస్తుంది.
కొండపై శ్రీనివాసుడు నిలువెత్తు రూపంలో స్వయంభువుగా ఆవిర్భవించాడు. కొండకింద గోవిందరాజస్వామి కూడా ఆవిర్భవించడం ఇక్కడి విశేషం. వేయి సంవత్సరాల చరిత్రగల ఈ వేంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకోవాలంటే, దాదాపు 'వెయ్యి మెట్లు' ఎక్కవలసిందే. కొండపైన స్వామిని దర్శించుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే భారీగా కనిపించే కొండరాళ్ల మధ్య స్వామి వెలిశాడు. స్వామిని దూరం నుంచి చూడటమే తప్ప దగ్గరికి చేరుకోవడం సాధ్యం కాదు.
ఇక ఇక్కడ హనుమంతుడు ... గరుత్మంతుడు కూడా వెలిసిన వాళ్లే. కొండ దిగువునగల గోవిందరాజుల వారు కూడా బండరాయిపై వెలిసిన వాడే. ఈ కారణంగా ఇది ఎంతో విశిష్టమైన క్షేత్రంగా చెప్పబడుతోంది. పూర్వం ఒక భక్తుడి కలలో స్వామివారు కనిపించి, ఈ ప్రదేశంలో తాను ఆవిర్భవించినట్టు తెలిపాడని స్థల చరిత్ర చెబుతోంది.
ఇక్కడి పరిసరాలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారు తిరుగాడినట్టు చెబుతారు. అందుకు నిదర్శనంగా ఇక్కడికి దగ్గరలో గల 'నల్లగుట్ట' పై స్వామివారి పాదుకలు దర్శనమిస్తూ వుంటాయి. ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి జాతర ప్రతి ఏడాది 'హోలీ' పండుగ రోజున ప్రారంభమవుతుంది. ఐదురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.
చివరి రోజున 'హసన్ పర్తి' నుంచి కళ్యాణ శ్రీనివాసుడి మూర్తిని, 'బీమారం' నుంచి అలమేలు మంగమ్మ మూర్తిని ఎర్రగట్టుకు ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆనవాయతీ కూడా తరతరాల నుంచి కొనసాగుతున్నదే. అలమేలు మంగమ్మ - శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల కల్యాణం తిలకించిన వారికి సకల శుభాలు చేకూరతాయని స్థానికులు చెబుతుంటారు.