వైకుంఠ పురం
కలియుగంలో వైభవాలను అందుకోవాలన్నా ... మోక్షాన్ని పొందాలన్నా అది శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. అందుకే ఆయన ఎక్కడ వున్నా అక్కడికి వెదుక్కుంటూ వెళ్లే భక్తులు కొందరైతే, ఆయన మనసు గెలుచుకుని తామున్న చోటుకే ఆయనని రప్పించే భక్తులు మరికొందరు. అలాంటి భక్తుడి కారణంగా నిర్మించబడినదే 'వైకుంఠ పురం'. పవిత్రతకు మారుపేరుగా కనిపించే ఈ క్షేత్రం తెనాలి సమీపంలో దర్శనమిస్తుంది.
చాలాకాలం కిందట ఒక భక్తుడికి కలలో స్వామి కనిపించి ఫలానా ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. దాంతో ఆ భక్తుడు స్వామివారి ఆదేశాన్ని అక్షరాలా అమలుపరిచాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని వైకుంఠపురంగా పిలుస్తుంటారు. అప్పటి నుంచి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. విశాలమైన ఆలయ ఆవరణలో ఎత్తయిన ప్రతిమలుగా గణపతి .. వేణు గోపాలుడు .. ప్రసన్నాంజ నేయుడు .. గరుత్మంతుడు దర్శనమిస్తారు.
రాజగోపురం దాటుకుని లోపలికి వెళితే, గర్భాలయంలో శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తాడు. స్వామివారికి మొక్కుబడులుగా భక్తులు నిత్య కళ్యాణాలు జరిపిస్తుంటారు. వైశాఖ మాసంలో స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి.
ఆలయ ప్రాంగణంలోనే శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై కనిపిస్తాడు. ఇక ఇక్కడే సహజంగా ఏర్పడిన పెద్ద పుట్టకు మంటపాన్ని నిర్మించారు. ఈ పుట్టలో నాగదేవత వుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ స్వామిని పూజించిన వారికి నాగదోషాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతుంటారు.