కర్మన్ ఘాట్
సూర్యభగవానుడి నుంచి సూర్య వంశానికి చెందిన శ్రీరామచంద్రుడి వరకూ అనేక మంది దేవతా మూర్తుల ఆశీస్సులను అందుకున్న హనుమంతుడు మహా శక్తిసంపన్నుడుగా కనిపిస్తాడు. వివిధ నామాలతో అనేక ప్రాంతాలలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా రంగారెడ్డి జిల్లాకి చెందిన 'కర్మన్ ఘాట్' దర్శనమిస్తూ వుంటుంది.
వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ హనుమంతుడు స్వయంభువుగా ఆవిర్భవించడం విశేషం. 11 వ శతాబ్దం ప్రధమార్థంలో స్వామివారి ఉనికి బయటపడినట్టుగా చరిత్ర చెబుతోంది. గోల్కొండ పాలకుడైన రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ ప్రాంతమంతా అడవిగా వుండేది. ఒకసారి వేటకి వచ్చిన ఆయనకి ఇక్కడ స్వయంభువుగా వున్న'ధ్యానాంజనేయ స్వామి' వారి విగ్రహం కనిపించింది. ఆయన వినయంగా స్వామికి నమస్కరిస్తూ వుండగా, తనకి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమనే అశరీరవాణి వినిపించింది.
ఆ మరునాడే ఆయన అందుకు సంబంధించిన పనులు ప్రారంభించి, కోనేరుతో సహా ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఆనాటి నుంచి స్వామివారికి నిత్య పూజలు ప్రారంభమయ్యాయి. రెండవ ప్రతాప రుద్రుడి తరువాత కాకతీయులు ఈ ప్రాంగణంలో వినాయకుడికి ... నాగేశ్వరస్వామికి ... సీతారాములకు ... స్పటిక లింగేశ్వర స్వామికి ... జగన్నాథ స్వామికి ... సంతోషిమాత ... దుర్గాదేవి ... సరస్వతీ దేవి అమ్మవార్లకి ప్రత్యేక మందిరాలను నిర్మించి పూజించారు.
ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి, స్వామివారి ఆగ్రహానికి గురయ్యాడని అంటారు. గర్భాలయంలో స్వామివారితో పాటు ఆలయం సిందూర వర్ణంలో కనువిందు చేస్తూ వుంటుంది. ధ్యానాంజనేయ స్వామివారిని దర్శించుకోవడం వలన, సుదీర్ఘమైన వ్యాధుల బారి నుంచి బయటపడతారని చెబుతుంటారు. ఈ స్వామి అనుగ్రహం కారణంగానే ఎంతోమంది ఆయా రంగాల్లో ఉన్నతమైన స్థానానికి చేరుకున్న దాఖలాలు వున్నాయి.
ఈ చుట్టుపక్కల ప్రాంతాలవారు స్వామిని ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు. ఆయన అనుమతి ... ఆశీస్సుల కోసం ఆరాటపడుతుంటారు. ఈ కారణంగానే ఆలయం ఎప్పుడు చూసినా భక్తులతో చాలా రద్దీగా వుంటుంది. ఇక పర్వదినాల సమయంలో స్వామి దర్శనానికి చాలా సమయం పడుతుంది. చారిత్రక పరమైన ... ఆధ్యాత్మిక పరమైన నేపథ్యం గల ఈ ఆలయాన్ని దర్శించడమంటే, ఆంజనేయుడి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందడమేనని చెప్పకతప్పదు.