తమ్మర సీతారాముడు
శ్రీరాముడు సకల గుణాభిరాముడు...మూర్తీభవించిన ధర్మావతారుడు. ధర్మమే విజయాన్ని సాధిస్తుందని చాటిచెప్పడం కోసం, అనేక కష్టనష్టాలను సహనంతో భరించినవాడు. గుండెల నిండా ఆవేదన దాచుకుని చిరుమందహాసాన్ని ఆవిష్కరిస్తూ ఆదర్శవంతమైన మార్గాన్ని అనుసరించినవాడు. సత్య ధర్మాలను పాటించేవారికి నిరంతరం అండగా నిలిచిన మహా పరాక్రమవంతుడు. అందుకే రాముడు ధీరుడైనాడు ... భారతీయుల పాలిట దేవుడైనాడు.
ఈ కారణంగానే ప్రతి గ్రామంలోను రామాలయాలు తప్పనిసరిగా దర్శనమిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో కొలువుదీరినదే 'తమ్మర' లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. నల్గొండ జిల్లా కోదాడ మండలంలో ఈ ఆలయం అలరారుతోంది. రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న జన్మించినది, ఇక్కడికి సమీపంలోని 'నేలకొండపల్లి' లోనే. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం, నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది.
ఆలయం ముందు విశాలమైన ఆవరణ వుంటుంది. స్వామివారికి ప్రతియేటా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించే 'కళ్యాణ మంటపం' ఈ ఆవరణలోనే దర్శనమిస్తుంది. మరో వైపున ఆలయ ప్రాకారానికి ఆనుకుని 'రథశాల' కనిపిస్తుంది. శ్రీ రామనవమి ఉత్సవాల్లో భాగంగా ఎత్తైన ఈ రథం మీదే సీతారాములను వుంచి, రథానికి ఇరువైపున కట్టిన తాళ్లను భక్తులంతా కలిసి లాగుతారు. ఇక ఎత్తైన గోపురాన్ని దాటుకుని లోపలికి వెళితే, వందలాది మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణ చేయగలిగేటంత విశాలంగా ఈ ఆలయం దర్శనమిస్తుంది.
పొడవైన ప్రాకార మంటపాల్లో స్వామివారికి సంబంధించిన వంటశాల .. యజ్ఞశాల .. వాహనాలు వుంటాయి. ప్రదక్షిణ మార్గంలోనే 'రామకోటి' స్థూపం కూడా కనిపిస్తుంది. ఆలయానికి పక్కనే ప్రాచీనకాలంనాటి కోనేరు ఉన్నప్పటికీ, ఇక్కడి బావి నీటితోనే స్వామివారికి అభిషేకాలు జరుపుతారు. గర్భాలయానికి ఎదురుగా హనుమంతుడు కొలువైఉంటాడు. గ్రహ పీడల నుంచి బయటపడేందుకుగాను ఈ హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. మంగళవారాల్లో స్వామికి ఆకుపూజ చేయించి వడమాలలు సమర్పిస్తూ వుంటారు.
గర్భాలయంలో స్వామివారు దీప కాంతుల మధ్య మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. ఇక్కడి రామయ్యని దర్శించుకోవడం వలన, సమస్త దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక ఇక్కడ అయిదు రోజులపాటు జరిగే శ్రీరామనవమి ఉత్సవాలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు ... స్వామివారికి కట్నకానుకలను సమర్పించుకుని సంతృప్తి చెందుతారు. ఈ సందర్భంగా జరిగే భజనలు ... కోలాటాలు ... పవళింపు సేవ .. రధోత్సవం చూసి తీరవలసిందే.