చేయి కాల్చుకున్న సాయి!
శ్రీ శిరిడీ సాయిబాబా లీలా విశేషాలను పరిశీలిస్తే, ఆయనని భక్తులు ఇంతలా ఆరాధించడానికి గల కారణం తెలుస్తుంది. తాను మశీదులో వుండి, ఎక్కడెక్కడో వున్న తన భక్తులను కాపాడిన తీరు ఎవరినైనా ఆశ్చర్యచకితులను చేస్తుంది. శిరిడీకి దూరంగా వున్న ఓ మారుమూల గ్రామంలో, సాయిని ఎంతగానో ఆరాధించే ఒక భక్తురాలు వుండేది. క్షయ వ్యాధితో బాధపడుతోన్న తన భర్తకు కొలిమి పనిలో సహకరిస్తూ వుండేది.
రోజు రోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వుండటం ఆమెకి ఆందోళన కలిగించసాగింది. ఓ పక్కన తన పసిబిడ్డ ఆలనా పాలన చూసుకుంటూనే, మరో పక్కన తన భర్తపై పని భారం ఎక్కువ పడకుండా కష్టపడుతూ వుండేది. బాబాయే తన కుటుంబాన్ని ఆదుకుంటాడనే బలమైన విశ్వాసం ఆమెలో కనిపిస్తూ వుండేది. భర్తను వెంటబెట్టుకుని బాబా దగ్గరకి వెళ్లాలని అనుకుంటూ వుండేది.
ఈ నేపథ్యంలోనే ఒక రోజున ఓ అనూహ్యమైన సంఘటన జరిగింది. ఎప్పటిలానే ఆమె తన పసిబిడ్డను ఒడిలో పడుకోబెట్టుకుని కొలిమి దగ్గర పనిచూస్తుంది. అదే సమయంలో భర్తకు తెరపు లేకుండా దగ్గు రాసాగింది. దాంతో ఆయనకి మంచినీళ్లు ఇవ్వాలనే ఆదుర్దాతో, ఒడిలో బిడ్డ ఉన్నాడనే సంగతి మరిచిపోయి ఒక్కసారిగా పైకి లేచింది. అంతే ఆమె ఒడిలోని బిడ్డ కొలిమిలో పడబోయాడు. అది గమనించిన ఆమె '' బాబా'' అంటూ పెద్దగా అరిచింది. అంతే కొలిమిలో పడవలసిన ఆ బిడ్డ, అంతే వేగంగా ఆమె చేతుల్లోకి వచ్చాడు.
ఊహించని ఈ సంఘటన ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన బిడ్డను కాపాడినది సాయియే అని భావించి, ఆయన దర్శనం కోసం భర్తతో కలిసి శిరిడీ బయలుదేరింది. రెండు .. మూడు రోజుల తరువాత ఆమె శిరిడీలోని బాబా మశీదుకి చేరుకుంది. బాబా చేయి కాలి వుండటం చూడగానే ఆమెకి విషయం అర్థమైపోయింది. తన బిడ్డను కాపాడటానికి బాబా చేయి కాల్చుకోవడాన్ని తట్టుకోలేక భోరున ఏడుస్తూ వెళ్లి ఆయన పాదాలపై పడింది.
కన్నీళ్లతో ఆమె బాబా పాదాలను కడుగుతూ కృతజ్ఞతలు తెలిపింది. తనకేమీ కాలేదంటూ బాబా ఆ పసిబిడ్డ తలను ప్రేమగా ... ఆప్యాయంగా నిమిరాడు. రెండు .. మూడు రోజుల క్రితం బాబా హఠాత్తుగా ధునిలో ఎందుకు చేయిపెట్టాడో ... బాధతో ఎందుకు విలవిలలాడిపోయాడో అనేది ఆమె మాటల వలన అక్కడున్నవారికి అర్థమైంది.