వివాహాల వేంకటేశ్వరుడు
కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరుడు ఎక్కడ వుంటే అక్కడ సంతోషం .. సంపద .. వెలుగు .. వైభవం వుంటాయి. నిత్య కల్యాణం ... పచ్చతోరణం అనిపించుకున్న శ్రీవేంకటేశ్వర క్షేత్రాలన్నీ నిరంతరం భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. అలాంటి పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటిగా మనకి విజయవాడ దర్శనమిస్తుంది. ఇక్కడి 'విద్యాధరపురం'లో స్వామివారు శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేతంగా కొలువుదీరి కనిపిస్తాడు.
విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, కుదురుగా ... ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో స్వామివారు స్వర్ణ కిరీటధారుడై సుందరంగా ... సుమనోహరంగా కనిపిస్తూ ఉంటాడు. తొలినాళ్లలో స్వామివారు ఒక్కరే ప్రతిష్ఠించబడి వుండేవారు. ఆ తరువాత కాలంలో లక్ష్మీ - పద్మావతి అమ్మవార్లను ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది.
సాధారణంగా స్వామి ఒక్కో క్షేత్రంలో ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఇక్కడి స్వామి కళ్యాణ వేంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిచెందాడు. వివాహం విషయంలో అనేక విధాలుగా ఆటంకాలు ఎదుర్కుంటోన్న వాళ్లు, ఇక్కడి ఆలయంలో రోజుకి 21 ప్రదక్షిణల చొప్పున 41 రోజుల పాటు చేస్తే వెంటనే వివాహమై పోతుందని చెబుతారు. ఈ కారణంగా ఈ సమస్యకి సంబంధించిన భక్తులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ వుంటారు.
ఇక మొక్కుబడులు రాబట్టుకోవడంలో కూడా స్వామి నిదర్శనం చూపిస్తూ ఉంటాడని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో గణపతి ... హనుమంతుడు కూడా పూజలు అందుకుంటూ వుంటారు. ప్రతి యేటా జ్యేష్ట శుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకూ అయిదు రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వుంటారు. ఈ సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై ... హనుమ వాహనంపై ... రథంపై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ వుంటాడు.