శ్రీ రంగనాయకుల గుట్ట
శ్రీ రంగనాథుడు తన లీలావిశేషాలలో భాగంగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో ఆయన సముద్ర తీరాలలోను ... నదీ తీరాలలోను ... కొండలపైనా ... గుట్టలపైన గుహల్లోనూ స్వయంభువుగా అవతరించాడు. అలా స్వామివారు నెలవైన పుణ్యక్షేత్రమే 'రంగనాయకుల గుట్ట'. పవిత్రమైన ... ప్రాచీనమైన ఈ క్షేత్రం రంగారెడ్డి జిల్లా 'గండిచెరువు'లో దర్శనమిస్తుంది.
ఇక్కడ స్వామివారు తన ఉనికిని బయటపెట్టినతీరు చూస్తే, ఇదెంత మహిమాన్వితమైన క్షేత్రమో అర్థమవుతుంది. పూర్వం ఇక్కడి గుట్టలోని గుహలో నుంచి గ్రామస్తులకు 'ఓంకారం' వినిపించింది. దాంతో గుహలో ఏవుందో .... ఆ ఓంకారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అంతాకలిసి గుట్టపైకి వెళ్లారు.
గుహలోని పెద్దపుట్ట సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉండటంతో, దానిలోపల ఏముందోననే ఆసక్తితో తొలగించి చూశారు. ఆ పుట్టలో నుంచి పది అడుగుల పొడవుగల రంగనాయకస్వామి విగ్రహం బయటపడింది. సాక్షాత్తు వైకుంఠవాసుడే తమ ఊరికి వచ్చినందుకు ఆ గ్రామస్తులంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు. గోదాదేవి సమేతంగా బయటపడిన స్వామిని అక్కడే ప్రతిష్ఠించారు.
ఇదంతా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. నాటి నుంచి స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. గుహలో నిండుగా ... నిర్మలంగా స్వామి కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలో పాడిపంటలు అభివృద్ధి చెందడానికి స్వామియే కారకుడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. స్వామిపట్ల కృతజ్ఞతతో నూతన వస్త్రాలను ... ఒడి బియ్యాన్ని సమర్పిస్తుంటారు.
ప్రతియేటా శ్రీ రామనవమి రోజునే ఇక్కడి స్వామివారికి ... గోదాదేవికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ వుంటారు. గుట్ట దిగువున గల కళ్యాణ మంటపంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుతారు.ఈ సమయంలో ఈ గుట్ట ప్రాంతం సందడికి వేదికగా ... సంబరాలకు కేంద్రంగా వెలుగొందుతుంది. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకను కనులారా తిలకించేందుకు ... మనసారా తరించేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.