పక్షులను పెంచవచ్చా ?
భగవంతుడి సృష్టిలో ఎన్నో అందమైన ప్రాణులు వున్నాయి. ఇవి తమ సహజ సౌందర్యంతో కొండకోనలకు ... వాగువంకలకు మరింత అందాన్ని తీసుకువస్తుంటాయి. రకరకాల పక్షులు ... సీతాకోకచిలుకలు ... ఇలా అనేక రకాల ప్రాణులు చూపరులను ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి. సాధారణంగా ప్రకృతి ప్రేమికులంతా, ఆ ప్రకృతిలో మమేకమైపోయిన జీవులను కూడా ఎంతగానో ప్రేమిస్తుంటారు.
వీళ్లు తమకి ఇష్టమైన ప్రాణులను ఎప్పుడూ దగ్గర నుంచి చూస్తూ, ఎల్లప్పుడూ ఆనందానుభూతులను పొందాలని అనుకుంటారు. అందుకోసం ఆయా ప్రాణులను ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటూ వుంటారు. ఇక పక్షుల విషయానికి వస్తే కొందరు రామచిలుకలు ... మరి కొందరు పావురాలు ... ఇంకొందరు ఇతర జాతులకు చెందిన అందమైన పక్షులు పెంచుకుంటూ వుంటారు.
నిజానికి వీటికి దూరంగా ఎక్కడికైనా వెళ్లాలంటే, వాటిని పెంచుతున్న వాళ్లకి దిగాలుగా వుంటుంది. అవే లోకంగా బతికేవాళ్లు, వాటికి ఏ చిన్న వ్యాధి సోకినా తల్లడిల్లిపోతుంటారు. అయితే ఎంత అపురూపంగా చూసుకున్నా, ఎంత కాలం పోషించినా వాటి స్వేచ్చను హరించిన దోషాన్ని అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది.
పక్షుల ప్రాణం అవి అనుభవించే స్వేచ్చలోనే వుంటుంది. సువిశాలమైన ఆకాశంలో ... సుందరమైన వనాలలో అవి అందంగా ... ఆహ్లాదంగా విహరిస్తూ వుంటాయి. ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని స్వీకరిస్తూ, వనాలకు వసంతాన్ని తెస్తుంటాయి. అలాంటి పక్షులను బంగారు పంజరాల్లో ఉంచినా, పండ్లు - పరమాన్నాలు పెట్టినా వాటికి రుచించవు.
రామచిలుకను బంధించిన పాపం కారణంగానే రామదాసు చెరసాల పాలైనాడనే విషయాన్ని ఆయన చరిత్ర చెబుతోంది. ఆయా ప్రాణులు సహజ సిద్ధంగా నివాసముండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాటికి ఆహారాన్ని అందించడం వలన పుణ్యం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వాటిని బంధించడం వలన బాధలు తప్పవనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.